![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -154 లో... కేశవని మర్చిపొమ్మని శైలు వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో గొడవ చేస్తారు కానీ శైలు మొండిగా ఉండడంతో శైలు వాళ్ళ అమ్మ వరాలు శైలుని కొడుతుంది. వాళ్ళ నాన్న ఆపుతాడు. మీరు గారాబం చేయబట్టే అది ఇలా తయారు అయిందని వరాలు కోప్పడుతుంది. ఆ తర్వాత మహా, కన్నా ఒక జట్టు కేశవ, చక్రి ఒక జట్టుగా క్యారమ్ ఆడుతారు. చక్రి, కేశవ గొడవపడుతారు. ఇలా కాదు.. అలా కొట్టుకోవాలి కనీసం మూడు నాలుగు కుట్లు అయినా పడాలని మహా అంటుంటే ఇద్దరు సైలెంట్ గా ఉంటారు.
ఆ తర్వాత ఇలా ఉంటే తనకి మనసులో మాట చెప్పలేను బయటకు తీసుకొని వెళ్ళాలని చక్రి అనుకొని.. ఒరేయ్ ఇంట్లో బోర్ గా ఉంది. అందరం కలిసి పిక్నిక్ కి వెళదామని కన్నాతో చక్రి అంటాడు. వెళదామని కన్నా అంటాడు. ఆ విషయం మహాకి చెప్తారు. తను కూడా ఒకే అంటుంది. కేశవ బయటకు వెళ్తాడు. శైలుకి ఫోన్ చేసి మాట్లాడతాడు. నువ్వు వెళ్ళాక నన్ను ఇంట్లో కొట్టారని శైలు చెప్తుంది. నిన్ను కలవాలని కేశవతో శైలు అంటుంది. ఇప్పుడు మేం బయటకు వెళ్తున్నామని కేశవ అనగానే నీ కోసం ఇంట్లో తన్నులు తిన్నాను కానీ నా గురించి అసలు పట్టించుకోవని కేశవతో శైలు అనగానే సరే అని కేశవ అంటాడు. ఆ తర్వాత కేశవ ఇంట్లోకి వచ్చి నాకు వేరే పని ఉంది.. మీరు వెళ్ళండి అని చెప్తాడు. ఆ తర్వాత అక్కడికి మనీషా వస్తుంది. తనని కూడా తమ వెంట తీసుకొని వెళ్ళాలనుకుంటారు.
ఆ తర్వాత అందరు పార్క్ కి వెళ్తారు. నారాయణ తన మందు బాటిల్ ని మహా బ్యాగ్ లో వేస్తాడు. లోపలికి వెళ్ళాక ఆ బ్యాగ్ నుంచి ఆ బాటిల్ తియ్యడానికి ఇబ్బంది పడతాడు. మహా బ్యాగ్ లో నారాయణ చెయ్ పెడుతుంటే.. చక్రి చూసి దొంగతనం చేస్తున్నావని అంటాడు. లేదు అందులో బాటిల్ పెట్టానని నారాయణ అంటాడు. మహా బ్యాగ్ లో నుంచి ఆ బాటిల్ తీస్తుంది. ఆ బాటిల్ చూసి నారాయణపై మహా కోప్పడుతుంది. నేను అలిగాను బుంగమూతి కూడా పెట్టానని నారాయణ ఒక పక్కకి వెళ్తాడు. మరొకవైపు శైలు, చక్రి కూడా అదే పార్క్ కి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |